బుద్ధ వనంలో ఘనంగా బుద్ధ ధాతువుల ప్రతిష్ఠ

హాలియా, వెలుగు : నాగార్జున సాగర్​ బుద్ధ వనంలో ఆదివారం బుద్ధ ధాతువుల ప్రతిష్ఠాపన నిర్వహించారు. బౌద్ధ భిక్షువు డాక్టర్ అజాన్ విసియన్, బుద్ధవనం ప్రత్యేక అధికారి మల్లేపల్లి లక్ష్మయ్య, ప్రభుత్వ అదనపు ప్రధాన కార్యదర్శి డాక్టర్ రాజశేఖర్​ టండ్రు, నల్లగొండ కలెక్టర్ కర్ణన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. కోలాటాలతో బౌద్ధ భిక్షువులు, ఊరేగింపుతో బుద్ధ ధాతువులను మహా స్తూపం అంతర్భాగంలోని ప్రతిష్ఠించారు.

కార్యక్రమంలో బుద్ధవనం విషయ నిపుణులు డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి, బాలీవుడ్ నటుడు గగన్ మాలిక్ ఫౌండేషన్ అధ్యక్షులు గగన్ మాలిక్, ఇండోనేషియాకు చెందిన బున్టారియా టిగ్రీస్, శీలా కుమార కోసన్, కేకే రాజా, కొండా లక్ష్మీకాంతరెడ్డి, సబ్బతి విష్ణుమూర్తి, భారతీయ బౌద్ధ సంఘం అధ్యక్షులు పరంధాములు, శుభాకార్ మేడసాని, ఓఎస్డి సుధన్ రెడ్డి, శ్యాంసుందర్రావు, డీఈలు దామోదర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ఏఈ నాజీజ్, రామ్ కుమార్ పాల్గొన్నారు.

ALSO READ : మూడోసారి గెలిచేది బీఆర్ఎస్సే: బి.వినోద్ కుమార్