ఖమ్మం జిల్లాలో సాగర్ కాల్వకు మరోసారి గండి

ఖమ్మం జిల్లాలో సాగర్ కాల్వకు మరోసారి గండి

ఖమ్మం జిల్లాలో సాగర్ కాల్వకు మరోసారి గండి పడింది. కూసుమంచి మండలం పాలేరు వద్ద ఇటీవల సాగర్ కాల్వకు గండి పడింది..కోట్ల రూపాయలు వెచ్చించి మరమ్మతులుచేశారు. 

శనివారం ( సెప్టెంబర్ 21) సాయంత్రంలో తిరిగి నీటిని విడుదల చేయడంతో అదే చోట మరోసారి గండి పడింది. దీంతో అప్రమత్తమైన అధికారులు నీటి సరఫరాను నిలిపివేశారు. నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే గండి పడిందని రైతులు ఆరోపిస్తున్నారు. 

కాంట్రాక్టర్, సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 

ALSO READ | స్పీడ్‌‌‌‌‌‌‌‌గా సాగర్‌‌‌‌‌‌‌‌ గండ్ల పూడ్చివేత

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఖమ్మం జిల్లా అతలాకుతలం అయిన విషయం తెలిసిందే.. ఖమ్మం జిల్లా చరిత్రలో కనీ వినీ ఎరుగనీ రీతిలో వరదలు వచ్చాయి. దీంతో పంటలు, గ్రామాలు, నివాసాలు పెద్ద ఎత్తున కొట్టుకుపోయాయి. 

వరదల కారణంగా నాగార్జున సాగర్ కాలువల కట్టలకు పలు చోట్లు గండ్లు పడ్డాయి. వందల  మీటర్ల మేర కట్టలు తెగిపోయాయి.. యుద్ధ ప్రాతిపదికన గండ్లను పూడ్చి వేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. కోట్ల రూపాయలు వెచ్చించి పూడ్చివేత పనులు చేస్తున్నారు. 

కూసుమంచి మండలం పాలేరు వద్ద ఇటీవల సాగర్ కాల్వకు గండి పూడ్చి వేత పనులు పూర్తి కావడంతో అధికారులు  శనివారం నీటిని వదిలారు.. అయితే మరోసారి సాగర్ కాల్వకు గండిపడింది. నాణ్యతా లోపం వల్లే మళ్లీ పరిస్థితి మొదటికి వచ్చిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.