నాగార్జునసాగర్ ప్రాజెక్టు 6 గేట్లు ఎత్తారు అధికారులు. మొదటగా 2 గేట్లను ఎత్తి నీటిని దిగువకు రిలీజ్ చేశారు. తర్వాత ఒక్కొక్కొటిగా మొత్తం ఆరు గేట్ల నుంచి నీటిని దిగువకు రిలీజ్ చేశారు. ఒక్కో గేటు నుంచి 5 నుంచి 10 లక్షల క్యూసెక్కుల నీరు కిందకి వెళ్తుంది.
దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అలర్ట్ చేశారు. కృష్ణమ్మ పరవళ్లతో నాగార్జునసాగర్ లో రోజురోజుకు నీటిమట్టం పూర్తిస్థాయికి చేరుతోంది. ప్రాజెక్టులోకి ఇన్ ఫ్లో 4 లక్షల 41వేల క్యూసెక్కులకు పైగా ఉంది.
నాగార్జున సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం నీటి మట్టం 580 అడుగులకు చేరింది. సాగర్ పూర్తి నీటి నిల్వ సామార్థ్యం 312 టీఎంసీలు కాగా..ప్రస్తుతం 284 టీఎంసీలు ఉన్నాయి.