
ఎగువ ప్రాంతాలనుంచి నాగార్జున సాగర్ కు వరద కొనసాగుతోంది. నాగార్జున సాగర్ కు 78వేల 286 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండగా..4 క్రస్ట్ గేట్లు ఎత్తి 78వేల 286 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. నాగార్జున సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590అడుగులుండగా.. ప్రస్తుత నీటి మట్టం 589.90 అడుగులు ఉంది. జలాశ యం పూర్తిగా నిండిపోయింది. ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 312.0450 టీఎంసీలుండగా.. ప్రస్తుతం నీటి నిల్వ 312.0450 టీఎంసీలుగా ఉంది. మరోవైపు నాగార్జున సాగర్ విద్యుత్ కేంద్రాలనుంచి ఉత్పత్తి కొనసాగుతోంది.