సాగర్​ ప్రాజెక్ట్​ 20 క్రస్ట్‌‌‌‌ గేట్లు ఓపెన్‌‌‌‌.. భారీసంఖ్యలో పర్యాటకులు

సాగర్​  ప్రాజెక్ట్​ 20 క్రస్ట్‌‌‌‌ గేట్లు ఓపెన్‌‌‌‌.. భారీసంఖ్యలో  పర్యాటకులు
  • సాగర్‌‌‌‌కు 2.47 లక్షల క్యూసెక్కుల ఇన్‌‌‌‌ఫ్లో

హాలియా, వెలుగు:  నాగార్జున సాగర్​ప్రాజెక్ట్‌‌‌‌కు భారీ మొత్తంలో ఇన్‌‌‌‌ఫ్లో వస్తోంది. ఎగువ నుంచి 2 లక్షల 47 వేల 182 క్యూసెక్కుల వరద వస్తుండడంతో 20 క్రస్ట్‌‌‌‌ గేట్లను ఎత్తి 2 లక్షల 2 వేల 404 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్‌‌‌‌ రిజర్వాయర్‌‌‌‌ పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకొని నిండుకుండలా మారింది. సాగర్‌‌‌‌ నుంచి కుడి కాల్వకు 6,969 క్యూసెక్కులు, ఎడమ కాల్వకు 6 వేల 173 విద్యుత్‌‌‌‌ ఉత్పత్తి ద్వారా 28 వేల 826 ఎస్‌‌‌‌ఎల్‌‌‌‌బీసీకి 2 వేల 400, వరదకాల్వకు 400 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.

పెరిగిన పర్యాటకుల రద్దీ

నాగార్జునసాగర్‌‌‌‌ 20 గేట్లు ఓపెన్‌‌‌‌ కావడం, ఆదివారం సెలవు కావడంతో పర్యాటకుల రద్దీ పెరిగింది. కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్‌‌‌‌తో కలిసి వచ్చి సెల్ఫీలు తీసుకుంటూ ఆనందంగా గడిపారు. అనంతరం బుద్ధవనం, నాగార్జునకొండ మ్యూజియం, సమ్మక్క సారక్క, ప్రధాన డ్యాం, శివాలయం ఘాట్‌‌‌‌, పవర్‌‌‌‌హౌస్‌‌‌‌, అనుపు, కొత్త వంతెన, పాత వంతెన, ప్రధాన గేట్లు, కొత్త బ్రిడ్జి తదితర ప్రదేశాల్లో పర్యటించారు. పర్యాటకులు భారీ సంఖ్యలో తరలిరావడంతో ట్రాఫిక్‌‌‌‌ ఇబ్బందులు తలెత్తాయి.