నిండుకుండలా సాగర్ ప్రాజెక్ట్ .. ‌‌ నాలుగు గేట్లు ఓపెన్ ‌‌

నిండుకుండలా సాగర్ ప్రాజెక్ట్ ..  ‌‌ నాలుగు గేట్లు ఓపెన్ ‌‌

హాలియా, వెలుగు : శ్రీశైలం నుంచి వస్తున్న వరదతో నాగార్జునసాగర్  ‌‌ ‌‌ నిండుకుండలా మారింది. సాగర్ ‌‌కు ఎగువ నుంచి 78,916 క్యూసెక్కుల నీరు వస్తోంది. దీంతో సాగర్ ‌‌ ప్రాజెక్ట్ ‌‌ నాలుగు గేట్లను ఐదు ఫీట్ల మేర ఎత్తి 32,400 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ ‌‌ పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు (312.50 టీఎంసీలు)కాగా ప్రస్తుతం పూర్తిస్థాయిలో నీటి నిల్వ ఉంది. సాగర్ ‌‌ నుంచి కుడి కాల్వకు 8,067 క్యూసెక్కులు, ఎడమ కాల్వకు 6,173, విద్యుత్ ‌‌ ఉత్పత్తికి 29,476, ఎస్ ‌‌ఎల్ ‌‌బీసీకి 2,400, వరద కాల్వకు 400 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.