ఆలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు

హాలియా, వెలుగు : అనుముల మండలం కొరివేనిగూడెం గ్రామంలోని శ్రీలక్ష్మీరేణుక అమ్మవారిని ఆదివారం నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేశారు. ఆయన వెంట కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కుందూరు వెంకట్ రెడ్డి

హాలియా మున్సిపాలిటీ ఫ్లోర్ లీడర్ చింతల చంద్రారెడ్డి, నాయకులు దేప తిరుపతిరెడ్డి, కుందూరు రాజేందర్ రెడ్డి, కలసాని చంద్రశేఖర్, మేరెడ్డి వెంకటనరసింహారెడ్డి, పసునూరు కిరణ్ రెడ్డి, వెంకటరమణారెడ్డి, మారుపాక నరసింహ, కొంగరి రమణయ్య, పేర్ల రవి తదితరులు ఉన్నారు.