ప్రతి గింజనూ కొంటాం : ఎమ్మెల్యే కుందూరు జై వీర్ రెడ్డి

ప్రతి గింజనూ  కొంటాం : ఎమ్మెల్యే కుందూరు జై వీర్ రెడ్డి

హాలియా, వెలుగు: రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని నాగార్జున సాగర్ ఎమ్మెల్యే కుందూరు జై వీర్ రెడ్డి అన్నారు. బుధవారం నల్గొండ జిల్లా అనుముల మండలంలోని రామడుగు గ్రామంలో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రం, పెద్దవూర , తిరుమలగిరి సాగర్ మండల కేంద్రాల్లోని మార్కెట్ సబ్ యార్డ్ ల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి రైతుకు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరను అందించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు.  

కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ తుమ్మలపల్లి చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి కాకునూరి నారాయణ గౌడ్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కుందూరు వెంకటరెడ్డి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చింతల చంద్రారెడ్డి, టౌన్ అధ్యక్షుడు వెంపటి శ్రీనివాస్, కుందూరు రాజేందర్ రెడ్డి, ఏపీఎం కళావతి, నిమ్మల లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం సాగర్ రిజర్వాయర్ లో ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.  

దళారులకు వడ్లు అమ్మొద్దు

యాదగిరిగుట్ట : ఆరుగాలం కష్టపడి పండించిన పంటను   దళారులకు అమ్మి మోసపోవద్దని రైతులకు ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ ఐనాల చైతన్యా మహేందర్ రెడ్డి సూచించారు. యాదగిరిగుట్ట మండలం సైదాపురం గ్రామంలో యాదగిరిగుట్ట పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ఆమె ప్రారంభించారు. 

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..  ప్రభుత్వం ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాల్లో ఉపయోగించుకొని,  మద్దతు ధర, బోనస్ పొంది అధిక లాభాలు పొందాలని కోరారు.ఈ కార్యక్రమంలో సైదాపురం మాజీ ఉప సర్పంచ్ దుంబాల సురేఖ వెంకట్ రెడ్డి, యాదగిరిగుట్ట పీఏసీఎస్ చైర్మన్ ఇమ్మడి రాంరెడ్డి, వైస్ చైర్మన్ కాటబత్తిని ఆంజనేయులు, కాంగ్రెస్ జిల్లా నాయకుడు శిఖ ఉపేందర్ గౌడ్ పాల్గొన్నారు.