- ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి
హాలియా, వెలుగు : హాలియా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి అన్నారు. సోమవారం హాలియా పట్టణంలోని ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా కళాశాల విద్యార్థులు, స్టాఫ్ తో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకుని అక్కడికక్కడే పరిష్కరించారు. కళాశాలలో ఆర్సీ ప్లాంట్ కోసం త్రీఫేస్ కరెంట్సరఫరా చేయాలని ఎమ్మెల్యే ట్రాన్స్కో ఏడీని ఫోన్ లో ఆదేశించారు.
కళాశాల ఆవరణ చుట్టూ ప్రహరీ నిర్మాణానికి కావాల్సిన నిధులు కేటాయించాలని కలెక్టర్ కు సూచించారు. విద్యార్థులకు కావాల్సిన డెస్కులను తన సొంత ఖర్చులతో అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు. అంతకుముందు కళాశాల ఆవరణలో ఎమ్మెల్యే మొక్కలు నాటారు. ఆయన వెంట మార్కెట్ కమిటీ చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి, పార్టీ జిల్లా కార్యదర్శి నారాయణగౌడ్, మండల అధ్యక్షుడు వెంకటరెడ్డి, మున్సిపల్చైర్పర్సన్ సలహాదారుడు నరేందర్రెడ్డి, ఫ్లోర్ లీడర్ చంద్రారెడ్డి, టౌన్ అధ్యక్షుడు శ్రీనివాస్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.