సాగర్​ను మరింత అభివృద్ధి చేస్తా : నోముల భగత్

హాలియా, వెలుగు : వచ్చే ఎన్నికల్లో మరోసారి గెలిపిస్తే నియోజకవర్గంలోని పెండింగ్​పనులన్ని పూర్తి చేసి మరింత అభివృద్ధి చేస్తానని నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్​ అన్నారు. ‘మన ఊరు–మన ఎమ్మెల్యే’ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం నల్గొండ జిల్లా త్రిపురారం మండలం  రాజేంద్రనగర్ లో రూ. 20 లక్షలతో నిర్మించిన గ్రామపంచాయితీని, దుగ్గేపల్లి నుంచి గుంటిపల్లి వరకు రూ. 2 కోట్ల 20 లక్షలతో బీటి రోడ్డు, నిడమానూరు నుంచి చింతగుడెం వరకు రూ.4 కోట్ల 35 లక్షలతో నిర్మించబోయే  రోడ్డు పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. 

కార్యక్రమంలో రాష్ట్ర ట్రైకార్ చైర్మన్ ఇస్లావత్ రామచంద్ర నాయక్, జడ్పీ వైస్ చైర్మన్ ఇరిగి పెద్దులు, నిడమానూర్ మార్కెట్ చైర్మన్ మర్ల చంద్రారెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు బహునూతల నరేందర్, మాజీ ఎంపీపీ రాంచంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.