భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఈ క్రమంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని నాగార్జున సాగర్ ప్రాజెక్ట్, మూసి ప్రాజెక్ట్ కు భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. తాజాగా ఆయా ప్రాజెక్టుల్లో ఉన్న నీటిమట్టాన్ని అధికారులు తెలిపారు.
నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అప్డేట్:
* ఇన్ ఫ్లో :- 52471 క్యూసెక్కులు
* ఔట్ ఫ్లో : 5944క్యూసెక్కులు
* పూర్తిస్థాయి నీటిమట్టం 590.00 అడుగులు.
* ప్రస్తుత నీటి మట్టం :- 509.00 అడుగులు.
* పూర్తి నీటి నిల్వ సామర్ధ్యం :- 312.5050 టీఎంసీలు.
* ప్రస్తుత నీటి నిల్వ :- 129.9780 టీఎంసీలు.
మూసి ప్రాజెక్ట్ అప్డేట్:-
* ఇన్ ఫ్లో :- 831.70 క్యూసెక్కులు
* ఔట్ ఫ్లో :- 542.47 క్యూసెక్కులు
* ప్రాజెక్ట్ పూర్తి స్దాయి నీటిమట్టం :- 645.00 అడుగులు
* ప్రస్తుతం :- 642.50 అడుగులు
* ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి నిల్వ :- 4.46 టీఎంసీలు
* ప్రస్తుతం :- 3.82 TMC లు