నాగార్జున సాగర్ నుంచి ఏపీకి నీళ్లు విడుదల చేశారు. రోజుకు 5 వేల క్యూసెక్కుల చొప్పున.. మొత్తం 11 రోజుల పాటు 5 టీఎంసీల నీటిని అధికారులు విడుదల చేయనున్నారు. ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ మురళీధర్ రెడ్డి ఆదేశాల మేరకు నాగార్జున సాగర్ ప్రాజెక్టు కుడి కాలువకు... రెండు గేట్ల ద్వారా 5 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు.
కృష్ణానది యాజమాన్య బోర్డు సభ్యులు అజయ్ కుమార్ గుప్తా పర్యవేక్షణలో అధికారులు నీటిని విడుదల చేశారు.