గోవాలో జరుగుతున్న 55వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఇఫీ) వేడుకల్లో ‘సెంటినరీ స్పెషల్ ఏఎన్నార్ : సెలబ్రేటింగ్ ది లైఫ్ అండ్ వర్క్స్ ఆఫ్ అక్కినేని’ పేరుతో ఓ స్పెషల్ ఈవెంట్‌ను ఏర్పాటు చేశారు నాగార్జున. ఈ సందర్భంగా ఏఎన్నార్ బయోపిక్ గురించి మాట్లాడుతూ ఆ బయోపిక్ బోర్ కొడుతుందేమో అని అన్నారు. ‘ఎవరి బయోపిక్ తెరకెక్కించాలన్నా వాళ్ళ జీవితంలో అద్భుతమైన విజయాలతో పాటు అదే స్థాయిలో కష్టాలు, వివాదాలు, ఒడిదుడుకులు కూడా ఉండాలి.
అయితే ఏఎన్నార్ గారు కెరీర్ తొలినాళ్లలో తప్ప ఆయన పికప్ అందుకున్నాక వెనక్కి తిరిగి చూడలేదు. కాబట్టి బయోపిక్ బోర్ కొడుతుందేమో. అయితే డాక్యుమెంటరీ రూపొందించే ఆలోచన మాత్రం ఉంది’ అని చెప్పారు. ఈ వేడుకలో అన్నపూర్ణ ఫిల్మ్ స్కూల్‌కు చెందిన విద్యార్థులు తీసిన షార్ట్ ఫిల్మ్ ‘రోడ్ నెం 52’ని ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో అక్కినేని అమల, నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల పాల్గొన్నారు.