బిగ్ బాస్ సీజన్7(Bigg boss season7) రోజురోజుకి రసవత్తరంగా సాగుతోంది. షో ప్రారంభంలో చెప్పినట్టుగానే చాలా ఆసక్తిని పంచుతోంది ఈ సీజన్. గేమ్స్, కంటెస్టెంట్స్ మధ్య గోడలు ఇలా ఆడియన్స్ సూపర్ ఎంటర్టైన్మెంట్ అందుతోంది. ఈ విషయంలో బిగ్ బాస్ సీజన్7 టీమ్ ఫుల్లుగా సక్సెస్ అయ్యారనే చెప్పాలి.
ఇక తాజాగా శనివారం నాటి ఎపిసోడ్ కు సంబందించిన ప్రోమోను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ప్రోమో కోసం ఆడియన్స్ కూడా ఎదురుచుస్తున్నారు. ఇక ఈ ప్రోమోలో హోస్ట్ నాగార్జున కంటెస్టెంట్స్ అండ్ వారి గేమ్ పై మండిపడ్డారు. ముందుగా ప్రియాంక అండ్ అమర్ డీప్ ను కడిగేసిన నాగార్జున.. ఆతరువాత సంచాలకే సందీప్ ను ఉతికేశాడు.
అమర్ దీప్ ను ఎందుకు కంటెండర్ పోటీ తప్పుకున్నావ్. ప్రియాంక చెప్పిన కారణంతో ను ఏకీభవించావా. లేదు అంటే ఎందుకు వాదించలేదు. అసలు నువ్వు నీ గురించి ఆడుతున్నావా? లేక ప్రియాంక గురించి ఆడుతున్నావా అని సీరియస్ గా అన్నారు. ఇక ఆ తరువాత సందీప్ గురించి మాట్లాడిన నాగార్జున.. సంచలక్ గా ను ఫెయిల్ అని అందరిచేత అనిపించాడు. దానికి సందీప్ బిగ్ బాస్ ఆ సమయంలో నన్ను పిలువలేదు అన్నాడు. దానికి వెంటనే నాగార్జున.. నువ్వేమైనా పిస్తావా పిలవడానికి అని ఫైర్ అయ్యాడు. దీంతో హోస్ అంతా ఒక్క క్షణం సీరియస్ గా మారింది. ఈ ప్రోమో చూస్తుంటే.. ఇవాళ్టి ఎపిసోడ్ కాస్త రసవత్తరంగా ఉండేలానే కనిపిస్తోంది.