- మా కుటుంబంపై సురేఖ చేసిన ఆరోపణలు అసంబద్ధం, అబద్ధం
కొండా సురేఖ చేసిన ఆరోపణలు తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రకంపనలు సృష్టించాయి. మంత్రి సురేఖ కామెంట్స్‌పై హీరో నాగార్జున స్పందించారు. మంత్రి సురేఖ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని ఎక్స్ లో పోస్ట్ చేశారు. ‘‘ రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలను.. మీ ప్రత్యర్థులను విమర్శించేందుకు వాడుకోకండి. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలను గౌరవించండి. బాధ్యత కలిగిన పదవిలో ఉన్న మహిళగా మీరు చేసిన వ్యాఖ్యలు, మా కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అసంబద్ధం, అబద్ధం. తక్షణమే మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను” అని సురేఖనుద్దేశించి ట్వీట్ చేశారు. కాగా, తండ్రి నాగార్జున చేసిన ట్వీట్‌ను నాగ చైతన్య రీట్వీట్ చేశారు.