Naa Saami Ranga Movie: పండక్కి అసలైన ఫ్యామిలీ సినిమా నా సామిరంగ..: నాగార్జున

సంక్రాంతి కానుకగా రిలీజైన సినిమాల జోరు చూస్తుంటే..అన్ని సినిమాలు చూసేయాలనే ఫీలింగ్ సినీ లవర్స్కి వస్తోంది.పండగ అంటే పల్లెటూరి వాతావరణం..కుటుంబం..అక్క చెల్లెళ్లు..బావ మరదళ్ళు..స్నేహితులు..ఇలా ప్రతి ఒక్కరి కలయికతో పండుగ జరుపుకుంటాం. మరి అసలు సిసలైన పండగ లాంటి సినిమా రేపు థియేటర్లలోకి వస్తోంది. అదే నాగార్జున సినిమా..నా సామిరంగ (Naa Saami Ranga).  

నాగార్జున (Nagarjuna) హీరోగా విజయ్ బిన్ని(Vijay Binny) దర్శకత్వంలో శ్రీనివాస చిట్టూరి నిర్మించిన చిత్రం సంక్రాంతి కానుకగా రేపు (జనవరి 14న) రిలీజ్ కానుంది. స్నేహం, ప్రేమ, త్యాగం, ద్వేషం..వంటి అంశాలతో వస్తోన్న చిత్రం కావడంతో భారీ అంచనాలున్నాయి. దీంతో నా సామిరంగ మేకర్స్ వరుస ప్రమోషన్స్ చేస్తూ..ఆడియన్స్లో పాజిటివ్ బుజ్ క్రియేట్ చేశారు. 

లేటెస్ట్గా హీరో నాగార్జున నా సామిరంగ సినిమా విశేషాలు పంచుకుంటూ..చాలా రోజుల తర్వాత మాస్‌ లుక్‌లో కనిపిస్తున్నాను..ఇంతకుముందు చేసిన సినిమాలతో పోలిస్తే ఇందులో ఎక్కువ యాక్షన్ సన్నివేశాలుంటాయని తెలిపారు. అంతేకాకుండా ఈ సినిమాలో మొత్తం ఏడు పాటలు..ప్రతి పాట కథలో ఎంతో ప్రత్యేకం అని చెప్పారు. ఇందులో అషికా రంగనాథ్‌తో కలిసి పనిచేయడం చాలా బాగా అనిపించిందని..మా ఇద్దరి మధ్య ఉన్న లవ్ ను..డైరెక్టర్ విజయ్ బిన్నీ చాలా బాగా చూపించారని తెలిపారు.

అలాగే ఈ సినిమాలో 12 ఏళ్లు ఉన్నప్పుడే ప్రేమలో పడతాం..ఆ తర్వాత 15ఏళ్లు కలుసుకోం..చాలా భిన్నమైన లవ్ స్టోరీ అని..అది అందరికీ నచ్చేస్తుందని చెప్పారు. అలాగే రికార్డులు, వసూళ్లపై పెద్ద ఆసక్తి లేదు.ఎప్పుడూ సినిమా రంగంలో కష్టపడుతూనే ఉండాలనుకుంటానని నాగ్ వెల్లడించారు. ఈ మూవీకి ఆస్కార్ విన్నర్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు.