హాలియా, వెలుగు : విద్యార్థులకు విలువలతో కూడిన నాణ్యమైన విద్యనందించాలని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి ఉపాధ్యాయులకు సూచించారు. సోమవారం నల్గొండ జిల్లా హాలియా పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీశ్లోక స్కూల్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద విద్యార్థులను ప్రతిఒక్కరూ ఆదుకోవాలన్నారు.
విద్యార్థులు చదువుతోపాటు క్రీడారంగంలో రాణించాలని సూచించారు. అనంతరం జేఈఈ అడ్వాన్స్ లో ఆలిండియా 131 ర్యాంకు సాధించి బాంబే ఐఐటీలో సీటు సాధించిన తిరుమల(సాగర్) మండలం బట్టు వెంకన్న బావితండాకు చెందిన జటావత్ అభినయ్ ను ఆయన అభినందించారు. విద్యార్థి, అతడి తల్లిదండ్రులు చందునాయక్, సాలమ్మను ఎమ్మెల్యే పూలమాల, శాలువాతో సన్మానించారు.
మున్సిపల్ చైర్ పర్సన్ అనుపమానరేందర్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తుమ్మలపల్లి చంద్రశేఖర్ రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కుందూరు వెంకటరెడ్డి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చింతల చంద్రారెడ్డి, టౌన్ అధ్యక్షుడు వెంపటి శ్రీనివాస్, నాయకులు పిల్లి ఆంజనేయులు, గౌని రాజారమేశ్ యాదవ్, నిమ్మల లక్ష్మారెడ్డి, యడవల్లి సోమశేఖర్, తక్కెళ్లపల్లి సైదులు పాల్గొన్నారు.