ప్రశాంతంగా నిమజ్జనం జరపాలి 

ప్రశాంతంగా నిమజ్జనం జరపాలి 
  • నాగార్జునసాగర్ ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి

హాలియా, వెలుగు : ప్రశాంతమైన వాతావరణంలో గణేశ్​నిమజ్జనం జరపాలని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి అధికారులకు సూచించారు. మంగళవారం హాలియా మున్సిపాలిటీ పరిధిలోని అలీనగర్​(14 వ మైలురాయి) సాగర్​ ఎడమ కాల్వ వద్ద నిర్వహించే గణేశ్ నిమజ్జన ప్రదేశాన్ని ఆయన అధికారులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గణేశ్ నిమజ్జనానికి అవసరమైన అన్ని ఏర్పాటు చేయాలన్నారు. ముఖ్యంగా బారికేడ్లు, క్రేన్లు, లైటింగ్, గజ ఈతగాళ్లను ఏర్పాటు చేయాలని చెప్పారు.

నిమజ్జన ప్రదేశంలో శానిటేషన్ తోపాటు తాగునీటి వసతి కల్పించాలని సూచించారు. ఆయన వెంట మిర్యాలగూడ సబ్ కలెక్టర్ అమిత్ నారాయణ్, అడిషనల్ కలెక్టర్ టి.పూర్ణచంద్ర, ఏఎస్పీ రాములు ఉన్నారు.   ఆస్పత్రిని తనిఖీ చేసిన ఎమ్మెల్యే జైవీర్​రెడ్డిహాలియా, వెలుగు: నాగార్జున సాగర్ కమలానెహ్రూ ఆస్పత్రిని​ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొంత కాలంగా వైద్యులు సిబ్బంది విధులకు సక్రమంగా హాజరుకావడం లేదని వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఆస్పత్రిని ఎమ్మెల్యే తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వైద్యులు, సిబ్బంది హాజరు వివరాల పరిశీలించారు. అనంతరం వార్డులను సందర్శించి సిబ్బంది పనితీరును అడిగి తెలుసుకున్నారు.