వరద బీభత్సం.. నాగార్జున సాగర్ 16 గేట్లు ఎత్తివేత

పక్క రాష్ట్రాలలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో వరద కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ పూర్తిగా నిండడానికి వస్తుంది. ఉదయం 10:57 గంటలకు నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజనీర్ సీఈ నాగేశ్వరరావు ఈఈ మల్లికార్జున రావు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం 16  క్రస్ట్ గేట్లను  5 అడుగుల మేరకు  ఎత్తినారు.

ఎగువ నుండి వస్తున్న వరద పట్టి దశల వారీగా మొత్తం 16 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నామని సీఈ నాగేశ్వరరావు తెలియజేశారు. భారీ వర్షాలకు తోడు ఎగువన కర్నాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ అన్ని ప్రాజెక్టులు పొంగి పారుతుండడంతో నాగార్జునసాగర్ డ్యామ్ కు భారీ వరద పోటెత్తడం జరుగుతుంది. 
గత సంవత్సరంలో ఆగస్టులో ఈసారి కూడా ఆగస్టులోనే నాగార్జున సాగర్ డ్యామ్ గరిష్ట నీటి మట్టానికి చేరుకోవడంతో గేట్లు తెరచుకున్నాయి. ఎగువన శ్రీశైలం డ్యామ్ వద్ద అన్ని గేట్లు ఎత్తేసి నాలుగు లక్షలకు పైగా వరద దిగువనకు వదులుతున్నారు.

దీంతో ఈ వరద వేగంగా సాగర్‌కు చేరుకుంటోంది. శ్రీశైలానికి ఎగువ నుంచి 4,00,491 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండటంతో 590 అడుగులకు గాను 583 అడుగుల నీరు ప్రస్తుతం చేరింది. సాగర్ యొక్క మొత్తం టిఎంసిలో 312 గాను 290 టీఎంసీలు నీళ్లు ఉన్నాయి గేట్ల ద్వారా43 వేల 986 క్యూసెక్కుల నీరు దిగువనకు విడుదల చేశారు.మొత్తానికి ఇన్ ఫ్లో 3 లక్షల 23 వేల 331 క్యూసెక్కుల వరద కొనసాగుతుంది. ఔట్ ఫ్లో లక్షా 63 వలే 220 క్యూసెక్కులు.  కుడి ఎడమ కాలువల ద్వారా మొత్తానికి ఔట్ ఫ్లో  83 వేల 549 క్యూసెక్కుల వరద వచ్చే  చేరుతుంది. ప్రవాహానికి అనుగుణంగా దిగువకు నీటి విడుదల చేస్తున్నారు. వరద పెరిగే కొద్దీ మరికొన్ని గేట్లు కూడా  ఎత్తి విడుదల చేస్తామని అధికారులు చెబుతున్నారు..