- ఎంపీలు మల్లు రవి, నాగరాజు
ఆమనగల్లు, వెలుగు: ధ్యానంతోనే శారీరక, మానసిక ప్రశాంతత లభిస్తుందని నాగర్కర్నూల్, కర్నూల్ ఎంపీలు మల్లు రవి, నాగరాజు పేర్కొన్నారు. శనివారం సాయంత్రం రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం హనుమాస్ పల్లి మహేశ్వర మహా పిరమిడ్ లో 11 రోజుల పాటు నిర్వహించే పత్రీజీ ధ్యాన మహాయాగాన్ని ట్రస్ట్ చైర్మన్ విజయ భాస్కర్ రెడ్డి, ధ్యాన గురువు కూతురు పరిమళ పత్రీజీతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మనిషి ఆరోగ్యం కోసం రోజు ధ్యానం చేయాలని సూచించారు. శ్వాస మీద ధ్యాసే ధ్యానమని, ధ్యాన గురువు బ్రహ్మర్షి సుభాశ్ పత్రీజీ ప్రపంచానికి ధ్యానాన్ని పరిచయం చేశారని చెప్పారు. ధ్యానాన్ని అలవర్చుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం వారు ధ్యాన కేంద్రంలో ధ్యానం చేశారు. పిరమిడ్ కో ఆర్డినేటర్ మాధవి, ట్రస్ట్ సభ్యులు శ్రీరాంగోపాల్, హనుమంత రాజు, రాంబాబు, సాంబశివరావు, దామోదర్ రెడ్డి, నిర్మలా దేవి, లక్ష్మిపాల్గొన్నారు.