
- నాగర్ కర్నూల్ కలెక్టర్ బాదావత్ సంతోష్
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : అర్హులైన రైతులందరికీ రైతు భరోసా కల్పించామని నాగర్ కర్నూల్ కలెక్టర్ బాదావత్ సంతోష్ తెలిపారు. పథకాల అమలుపై మంగళవారం కలెక్టరేట్ లో అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశం ఆయన మాట్లారు. సంక్షేమ పథకాల అమలులో అధికారులే కీలకమన్నారు. ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో పారదర్శకత పాటించాలని సూచించారు.
అర్హులైన రైతులకు మాత్రమే ప్రభుత్వం అందించే రైతు భరోసా పథకం చేరేలా చూడాలన్నారు. రైతుల సంక్షేమం కోసం వ్యవసాయ భూముల గుర్తింపు ప్రక్రియను స్పీడప్ చేయాలని అధికారులను ఆదేశించారు. వ్యవసాయానికి అనువుకాని భూమిని 100 శాతం గుర్తించాలని చెప్పారు. ప్రతి గ్రామంలో హౌస్ హోల్డ్ డేటాను కచ్చితంగా సేకరించి అర్హులైన కుటుంబాలను గుర్తించాలన్నారు.