ఏసీబీ వలలో చిక్కిన ఎస్సై.. రూ. 50 వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెగా దొరికాడు..

ఏసీబీ వలలో చిక్కిన ఎస్సై.. రూ. 50 వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెగా దొరికాడు..

రోజుకో అవినీతి అధికారి గుట్టు రట్టవుతుంది. ఏసీబీ అధికారులు వేసిన వలలో చాపల చిక్కుకుంటున్నారు. జూన్ 26, 2024 బుధవారం నాడు నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ ఎస్సై లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు.  పేలుడు పదార్థాలు కల్గిన వ్యక్తిపై కేసు రిజిస్టర్ చేయకుండా ఉండేందుకు నాగర్‌కర్నూల్ జిల్లా, వెల్దండ పోలీస్ స్టేషన్‌లోని ఎస్సై ఎం. రవి, రూ. 50 వేలు లంచం డిమాండ్ చేశాడు.  

అంబులెన్స్ డ్రైవర్ జీ. విక్రమ్ ద్వారా నగదు తేవాలని ప్లాన్ వేశాడు. లంచం గురించి పక్క సమాచారం అందుకున్న ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. లంచం చేతులు మారుతుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఎస్సై ఎం. రవి పై కేసు నమోదు చేసి దర్యప్తు చేపట్టారు ఏసీబీ టీం.