బీఆర్ఎస్​కు రాజకీయ భవిష్యత్​ ఉండదు : ఎంపీ మల్లు రవి

బీఆర్ఎస్​కు రాజకీయ భవిష్యత్​ ఉండదు : ఎంపీ మల్లు రవి
  • నాగర్​కర్నూల్​ ఎంపీ మల్లు రవి 

వనపర్తి, వెలుగు : ప్రజల హక్కులను కాలరాసిన బీఆర్ఎస్​ పార్టీకి రాజకీయ భవిష్యత్​ ఉండదని నాగర్ కర్నూల్  ఎంపీ మల్లు రవి పేర్కొన్నారు. శుక్రవారం నియోజకవర్గానికి వచ్చిన మల్లు రవికి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. మర్రికుంట నుంచి దాచ కల్యాణ మండపం వరకు బైక్  ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ఎన్నికల్లో ప్రజలను ఎంత ప్రలోభపెట్టినా, తనపై నమ్మకంతో లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించారని తెలిపారు. విద్య, వైద్యం, సాగునీరు, ఉపాధిరంగాలకు ప్రాధాన్యతనిస్తూ కేంద్ర ప్రభుత్వం ద్వారా రావాల్సిన నిధులను తెప్పించి అభివృద్ధి చేస్తానన్నారు.

బీఆర్ఎస్​కు చెందిన27 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరేందుకు రెడీగా ఉన్నారన్నారు. డీసీసీ  అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ యాదవ్, మున్సిపల్ చైర్మన్  పుట్టపాక మహేశ్, పాకనాటి కృష్ణ, చీర్ల చందర్, కౌన్సిలర్​ బ్రహ్మం, ఎంపీపీ కిచ్చా రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, శంకర్ ప్రసాద్, శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.

హాస్టల్​ సమస్యలు పరిష్కరిస్తా

గద్వాల : హాస్టళ్లలో సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని ఎంపీ మల్లు రవి తెలిపారు. గద్వాల పట్టణంలోని బీసీ బాలికల హాస్టల్ ను పరిశీలించారు. స్టూడెంట్స్ తో కలిసి బ్రేక్ ఫాస్ట్  చేసి, నోట్ బుక్స్  పంపిణీ చేశారు. గర్ల్స్  హైస్కూల్ లో అడిషనల్​ రూమ్స్​ నిర్మాణం కోసం తన ఫండ్స్  నుంచి రూ.75 లక్షలు కేటాయిస్తున్నట్లు తెలిపారు. అనంతరం శెట్టి ఆత్మకూర్ దగ్గర నిర్మిస్తున్న ఐటీఐ బిల్డింగ్  పనులను పరిశీలించారు.

ఐటీఐ బిల్డింగ్  నిర్మాణం కోసం రీ టెండర్లు పిలవాలని ఆఫీసర్లకు సూచించారు. వేదనగర్  కాలనీలో  దొంగతనం జరిగిన వీరప్రసాద్  ఫ్యామిలీని పరామర్శించారు. జడ్పీ చైర్​పర్సన్  సరిత, బండ్ల చంద్రశేఖర్ రెడ్డి, తిరుపతయ్య, శంకర్, మధుసూదన్ బాబు, నాగేందర్ యాదవ్  పాల్గొన్నారు.