వైట్ కాలర్ నేరాల్లో దిట్ట.. నాగేంద్ర ప్రసాద్ శర్మ అరెస్ట్

వైట్ కాలర్ నేరాల్లో దిట్ట.. నాగేంద్ర ప్రసాద్ శర్మ అరెస్ట్

హైదరాబాద్: గత కొన్ని సంవత్సరాలుగా వైట్ కాలర్ నేరాలకు పాల్పడుతున్న నాగేంద్ర ప్రసాద్ శర్మ అనే వ్యక్తిని కేపీహెచ్ బీ పోలీసులు ఆదివారం జూలై 28,201అరెస్ట్ చేశారు. నిందితుడిని బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు. తన సోదరుడు పవన్ కుమార్ తో కలిసి నేరాలకు పాల్పడుతున్న నాగేంద్ర ప్రసాద్ శర్మం.. చర్లప్లలి జైలుకు తరలించినట్లు కేపీహెచ్ బీ సీఐ వెంక టేశ్వరరావు చెప్పారు. 

2015 నుంచి 2019 వరకు నాలుగు కంపెనీలను ఏర్పాటు చేసి నాగేంద్ర ప్రసాద్ శర్మ ఉద్యోగులను సైతం మోసం చేశాడు. ఇంటి స్థలాలు, కార్లు, వ్యాపారం తోపాటు తనకు వివిధ వర్గాలలో వీఐపీలు తెలుసని ప్రజలను మోసం చేశారు. కేపీహెచ్ బీ, మాదాపూర్, మియాపూర్, బాచుపల్లి, జగద్గిరిగుట్ట, ఆంధ్రప్రదేశ్ లలో నాగేంద్ర ప్రసాద్ శర్మపై పలు కేసులు నమోదు అయ్యారు. 2021లో పీడీ యాక్టు కూడా నమోదు చేశారు. బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్, కూకట్ పల్లి ఏసీపీ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు నిందితుడిని అదుపులోకి తీసుకుని చర్లపల్లి జైలుకు తరలించారు.