గోదావరిఖని, వెలుగు : తెలంగాణ మన ముదిరాజ్ మహాసభ అనుబంధ మత్స్యకారుల విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా కరీంనగర్ పట్టణానికి చెందిన మందా నగేశ్ ముదిరాజ్‌ను మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు చొప్పరి శంకర్ ముదిరాజ్ నియమించారు. ఈ మేరకు సోమవారం నియామక పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా శంకర్ ముదిరాజ్ మాట్లాడుతూ రాష్ట్రంలోని ముదిరాజ్ మత్స్యకారుల అభివృద్ధి లక్ష్యంగా పనిచేయాలని, వారి సమస్యల పరిష్కారం కోసం పోరాడి మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపడానికి కృషి చేయాలని కోరారు. తనను నియమించిన తెలంగాణ మన ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు శంకర్ ముదిరాజ్‌కు మందా నగేశ్ ముదిరాజ్ కృతజ్ఞతలు తెలిపారు.