పెళ్లి బరాత్ అంటే డీజే పాటల హోరుతో హుషారెత్తిపోతుంది. బంధువులు, స్నేహితుల సందడి మధ్య అదిరిపోయే సాంగ్స్కు డ్యాన్స్ లు చేస్తుంటారు. వధూవరులను ఊరేగింపుగా తీసుకెళ్తూ డీజే సాంగ్స్ కు స్టెప్పులతో చిందులేస్తారు. సాధారణంగా పెళ్లి బారాత్ లో నాగిని డ్యాన్స్ లు వేయడం చూస్తుంటాం. కానీ బారాత్ లో నాగుపాము ప్రత్యక్షమై నాగిని డ్యాన్స్ చేస్తే ఎలా ఉంటుంది. అది చూసిన వాళ్లు అక్కడ ఉంటారా..? ప్రాణాలను అరచేతిలో పెట్టుుకుని పరుగులు తీస్తారు. కానీ ఒడిశాలో మాత్రం అలా జరగలేదు. నాగుపాముతో కలిసి ఉత్సాహంగా డ్యాన్స్ చేశారు యువకులు. నాగిన్ పాటకు నాగుపాము అయితే అద్భుతంగా డ్యాన్స్ చేసింది. సినిమాల్లో చూపించినట్టుగానే ఊగిపోయింది.
మయూర్‌భంజ్ జిల్లా కరంజియా పట్టణానికి చెందిన ఓ యువకుడికి రెండ్రోజుల క్రితం పెళ్లి జరిగింది. వివాహం అనంతరం వధూవరులను ఊరేగింపుగా వరుడి ఇంటికి తీసుకెళ్తున్నారు. ఐతే బరాత్‌లో మై నాగిన్.. నాగిన్ పాటకు నాగుపాము నృత్యం చేసింది. డీజే సాంగ్స్ కు అందరూ స్టెప్పులు వేస్తుండగా అనుకోకుండా బుసలు కొడుతూ బుట్టలో నుంచి బయటకు వచ్చింది నాగుపాము. స్థానికంగా పాములు ఆడించే ఓ వ్యక్తి బుట్టలో ఉన్నపామును అందరికీ చూపిస్తూ నృత్యం చేయించాడు. జనం కేరింతలు..ఈలల మధ్య నాగుపాము కొద్దిసేపు బాగానే డ్యాన్స్ చేసింది. ఆ తర్వాత భయపడిపోయింది. తన చుట్టూ ఏం జరుగుతుందో దానికి అర్థం కాలేదు. కానీ పాములను ఆడించే వ్యక్తి మాత్రం.. బుట్టలో నాగుపామును అటూ ఇటూ తిప్పుతూ.. అందరికీ చూపిస్తూ ఉత్సాహంగా డాన్స్ చేయించాడు. బుసలు కొడుతున్న పామును చూసి కొందరు స్థానికులు భయడిపోయారు. వెంటనే అటవీశాఖ అధికారులు,పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు నాగుపామును రక్షించారు. ఈ ఘటనలో ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు పోలీసులు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మరిన్ని వార్తల కోసం