ప్రేమ వివాహం చేసుకున్న నాగిని సీరియల్ నటి.. వరుడు ఎవరంటే.?

ప్రేమ వివాహం చేసుకున్న నాగిని సీరియల్ నటి.. వరుడు ఎవరంటే.?

నాగిని సీరియల్ లో ప్రధాన పాత్రలో నటించి బుల్లితెర ప్రేక్షకులను అలరించిన ప్రముఖ హిందీ సీరియల్ నటి సురభి జ్యోతి వివాహం ఘనంగా జరిగింది. ఈ క్రమంలో అక్టోబర్ 27న ఉత్తరాఖండ్‌లోని జిమ్ కార్బెట్ రిసార్ట్‌లో సన్నిహితులు మరియు కుటుంబ సభ్యుల సమక్షంలో తన తోటి నటుడైన సుమిత్ సూరి ని వివాహం చేసుకుంది. 

ఈ విషయాన్ని సుమిత్ సూరి మరియు సురభి జ్యోతి సోషల్ మీడియా వేదికగా తన అభిమానులకి తెలియజేశారు. అలాగే తమ పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ హ్యాపీ వెడ్డింగ్ అంటూ క్యాప్షన్ పెట్టగా అభిమానులు, స్నేహితులు శుభాకాంక్షలు తెలియజేశారు.

అయితే నటి సురభి జ్యోతి మరియు సుమిత్ సూరి 5ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో ఇటీవలే వీరి పెళ్లికి పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా హిందూ సంప్రదాయ ఆచారాల పద్దతిలో పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. 

ALSO READ : ఇన్స్టాగ్రామ్ లో మాజీ భార్యతో దిగిన చివరి ఫోటోని డిలీట్ చేసిన నాగ చైతన్య..

ఈ ఇద్దరి కెరీర్ విషయానికొస్తే ఈ ఏడాది ఆరంభంలో సురభి పంజాబీ డైరెక్టర్ మానవ్ షా డైరెక్ట్ చేసిన ఖాదర్ అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. కానీ ఈ సినిమా అకనీసం రిలీజ్ అయినట్లు కూడా ప్రేక్షకులకు తెలియలేదు. దీంతో ప్రస్తుతం సురభి జ్యోతి మళ్ళీ బుల్లితెర ఆఫర్లపై దృష్టి సాదిరించింది. ఇక సుమిత్ సూరి కూడా పలు వెబ్ సీరీస్లలో నటిస్తున్నాడు.