
ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్ వెలుగు : నాగోబా జాతర అట్టహాసంగా ప్రారంభమైంది. ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్లో జరుగుతున్న జాతరకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి పెద్దఎత్తున భక్తులు, మెస్రం వంశీయులు తరలివస్తున్నారు.
ఆలయ పరిసరాల్లో దుకాణాలు వెలిశాయి. భక్తులతో ఆలయ ప్రాంగణాలు, రోడ్లు కిటకిటలాడుతున్నాయి. జాతరకు వచ్చేవారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అన్ని చర్యలు చేపట్టారు. పోలీసు భద్రతతో పాటు ఇతర శాఖల అధికారులు సమన్వయంతో జాతర ఏర్పాట్లు చేశారు.