హైదరాబాద్, వెలుగు: ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్ లో ఈ నెల 28 నుంచి 31 వరకు నాగోబా జాతరను వైభవంగా నిర్వహించనున్నారు. వచ్చే నెల1 నుంచి 3 వరకు నిర్మల్‌జిల్లా బాసరలోని జ్ఞాన సరస్వతి ఆలయంలో వసంత పంచమి ఉత్సవాలు జరగనున్నాయి.
హైద రాబాద్ జూబ్లిహిల్స్ లోని మంత్రి నివాసంలో దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్, బాసర ఆలయ ఇన్ చార్జ్ కార్యనిర్వహణాధికారి నవీన్ కుమార్, సహాయ కార్యనిర్వహణాధికారి సుదర్శన్, వేదపండితులు కలిశారు. ఈ సందర్భంగా నాగోబా జాతర, వసంత పంచమి ఉత్సవాలకు రావాలని మంత్రి సురేఖకు ఆహ్వాన పత్రికను అందించారు. అనంతరం వేదపండితులు మంత్రి సురేఖకు అమ్మవారి తీర్థ ప్రసాదాలు, శేషవస్త్రాలను అందించారు.