
రెండో అతి పెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన నాగోబా జాతర అట్టహాసంగా సాగుతోంది. గురువారం పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. మెస్రం వంశీయులు పెర్సపేన్, బాన్ దేవతలకు ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం గోవడ్ నుంచి మెస్రం వంశీయులు సాంప్రదాయ వాయిద్యాలతో నాగోబా ఆలయం వెనుకున్న బాన్ దేవత ఆలయానికి చేరుకొని మొక్కులు తీర్చుకున్నారు. మెస్రం ఆడపడుచులు, మహిళలు కోనేరు నీటితో కొత్త పుట్టలు తయారు చేసి పూజలు నిర్వహించి నైవేద్యం సమర్పించారు. - వెలుగు, ఆదిలాబాద్