నాగోబా హుండీ ఆదాయం 21.08 లక్షలు

నాగోబా హుండీ ఆదాయం 21.08 లక్షలు

ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్ ​జిల్లా కేస్లాపూర్ నాగోబా జాతర సందర్భంగా భక్తులు హుండీలో వేసిన కానుకలను గురువారం ఆలయ ప్రాంగణంలో మెస్రం వంశీయులు లెక్కించారు. ఆలయ కమిటీ సభ్యులు, రెవెన్యూ , దేవాదాయ, ఐటీడీఏ, పోలీసు అధికారుల సమక్షంలో ముందుగా హుండీని తెరిచారు. లెక్కించగా రూ. 21,08,511 లక్షల ఆదాయం వచ్చినట్లు దేవాదాయ శాఖ ఈవో రాజమౌళి తెలిపారు. 

ఇందులో తై బజార్ ద్వారా రూ. 11,36,843, భక్తుల కానుకల ద్వారా రూ. 9,71,677 వచ్చినట్లు చెప్పారు. ఆలయ పీఠాధిపతి మెస్రం వెంకట్ రావు, ఆలయ కమిటీ చైర్మెన్ మెస్రం ఆనంద్ రావు, మెస్రం వంశీయులు పాల్గొన్నారు.