
నాగ్‌పూర్: హింసతో అట్టుడికిన నాగ్‌పూర్ లో పోలీసులు కర్ఫ్యూను పూర్తిగా ఎత్తివేశారు. ఛత్రపతి శంభాజీనగర్ జిల్లాలోని మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సమాధిని తొలగించాలని వీహెచ్ పీ, బజరంగ్ దళ్ నిరసనలు చేపట్టడంతో అక్కడ మార్చి 17న పెద్ద ఎత్తున ఘర్షణలు చెలరేగాయి.
ఈ క్రమంలోనే కొత్వాలి, గణేశ్ పేట్, తహసీల్, లకడ్ గంజ్, పచ్‌పావోలి, శాంతి నగర్, తదితర ప్రాంతాలలో పోలీసులు కర్ఫ్యూ విధించారు. మార్చి 20న నందన్ వన్, కపిల్ నగర్ పోలీస్ స్టేషన్ ప్రాంతాల్లో, మార్చి 22న పచ్ పావోలి, శాంతి నగర్, లకడ్ గంజ్, శక్కర్ దార, ఇమామ్ బాడ ప్రాంతాల్లో కర్ఫ్యూను ఎత్తివేశారు. మిగతా ప్రాంతాల్లో ఆదివారం కర్ఫ్యూ ఎత్తివేసినట్లు పోలీసులు వివరించారు.