నాగ్‌పూర్ హింసాకాండ: కీలక నిందితుడి ఇల్లు కూల్చివేత

నాగ్‌పూర్ హింసాకాండ: కీలక నిందితుడి ఇల్లు కూల్చివేత

నాగ్‌పూర్ హింసాకాండలో కీలక నిందితుడు ఫాహిమ్ ఖాన్ ఇంటిని కూల్చేశారు అధికారులు. కొద్దిరోజుల క్రితం ఫాహిమ్ ఖాన్ ఇంటి నిర్మాణంలో లోపాలున్నాయని.. ప్లాన్ అప్రూవల్ లేదంటూ నోటీసులు జారీ చేసిన మునిసిపల్ అధికారులు సోమవారం ( మార్చి 24 ) ఫాహిమ ఖాన్ ఇంటిని కూల్చేశారు. మార్చి 17న నాగపూర్ లో జరిగిన హింసాకాండలో అరెస్టైన 100మందిలో మైనారిటీ డెమొక్రటిక్ పార్టీ నాయకుడు ఫహీమ్ ఖాన్ కీలక నిందితుడిగా ఉన్నారు.

నాగ్‌పూర్‌లోని యశోధర నగర్ లో ఫహీమ్ ఖాన్ భార్య పేరు మీద ఉన్న ఇల్లు నిబంధనలకు విరుద్ధంగా ఉందని తేల్చిన మునిసిపల్ అధికారులు ఇవాళ కూల్చేశారు. .

జైలులో ఫహీమ్ ఖాన్:

మార్చి 17న ఛత్రపతి శంభాజీనగర్‌లోని ఔరంగజేబు సమాధిని తొలగించాలని డిమాండ్ చేస్తూ విశ్వ హిందూ పరిషత్ (VHP) నేతృత్వంలో జరిగిన నిరసనల సందర్భంగా హింస చెలరేగింది. ఈ ఘర్షణల వల్ల నాగపూర్ లో అనేక ప్రాంతాల్లో రాళ్ళ దాడులు, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం జరిగింది. ఈ అల్లర్లలో ముగ్గురు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ స్థాయి అధికారులు సహా 33 మంది పోలీసు సిబ్బంది గాయపడ్డారు.

Also Read:-హైదరాబాద్ లో ఆధార్ అప్డేట్ అంటే నరకమే.. 

ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న సీఎం ఫడ్నవిస్ ఘటనకు కారణమైనవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని.. ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం వల్ల కలిగిన నష్టాన్ని నిందితుల నుంచి వసూలు చేయాలని ఆదేశించారు. హింసను ప్రేరేపించే విధంగా రెచ్చగొట్టే కంటెంట్‌ను ప్రసారం చేసిన వారిని సహ నిందితులుగా చేర్చాలని అన్నారు ఫడ్నవిస్.