కోడలా కోడలా కొడుకు పెళ్లామా అంటారు.. ఈ కోడలు మాత్రం మామూలుది కాదు.. సీరియల్స్ లో వచ్చే విలనీ కంటే మహా డేంజర్ అని నిరూపించింది. 300 కోట్ల రూపాయల ఆస్తి కోసం.. అడ్డుగా ఉన్న మామను.. భర్త తండ్రిని లేపేయటానికి పెద్ద స్కెచ్ వేసింది. చేతికి రక్తం అంటకుండా.. హిట్ అండ్ రన్.. అంటే రోడ్డు ప్రమా దంలో చనిపోయే విధంగా ప్లాన్ వేసింది. తన ప్లాన్ అమలు చేయటం కోసం గుండాలకు సుపారీ కూడా ఇచ్చింది. ఇంతకీ మామను చంపిందా లేదా.. ప్లాన్ వర్కవుట్ అయ్యిందా లేదా అనే చూద్దాం...
మే 22,2024న నాగ్ పూర్ లోని బాలాజీ నగర్ లో 82 ఏళ్ల పురుషోత్తం అనే వృద్ధుడిని గుర్తు తెలియని కారు ఢీకొట్టింది. పోలీసులు ఆ కారును గుర్తించారు.. డ్రైవర్ అరెస్ట్ కూడా చేశారు.. ఇది నిజంగానే యాక్సిండెంట్ అనుకుని ప్రాథమిక నిర్ధారణకు వచ్చి వెంటనే స్టేషన్ బెయిల్ ఇచ్చి డ్రైవర్ ను విడుదల కూడా చేశారు. అయితే పోలీసు ఉన్నతాధికారులకు ఈ కేసులపై అనుమానం వచ్చింది. వెంటనే ఈ కేసులో సమగ్రమైన విచారణ జరపాలని ఆర్డర్ వేశారు. ఇంకేముందు.. విచారణలో అసలు విషయాలు బయటికొచ్చాయి.
దాదాపు 300కోట్ల రూపాయల ఆస్తిపాస్తులను కలిగిఉన్న పురుషోత్తంను చంపించేందుకు అతని కోడలే ప్లాన్ వేసి కారుతో ఢీకొట్టిందట. ఇందుకోసం తనదగ్గర పనిచేసే డ్రైవర్ తో పాటు మరో వ్యక్తితో కలిసి కుట్ర పన్నిందట. ఇదంతా పోలీసుల విచారణలో తేలింది. పురుషోత్తం కోడలితో పాటు డ్రైవర్, మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు పోలీసులు.
చంపేందుకు ఇలా ప్లాన్ చేశారు...
పురుషోత్తంను యాక్సిడెంట్ లో చంపించాలని కోడలు అర్చన పథకం వేసింది. పక్కా ప్లాన్ ప్రకారం.. తన దగ్గర పనిచేసే డ్రైవర్ బగ్దేకు డబ్బు ఆశ చూపింది. తనతో పాటు ఇంకో వ్యక్తి ధార్మిక్ ని ఈ ప్లాన్ లో భాగస్వామిని చేసింది. తన మామ పురుషోత్తంను హిట్ అండ్ రన్ లో చంపితే కోటి రూపాయలు ఇస్తానని ఆఫర్ చేసింది. మొదట వారిద్దరి చేత ఓ పాత కారు కొనిచ్చింది. వారిద్దికి ఎవరికీ అనుమానం రాకుండా వీధుల్లో వెళ్తున్నపుడు తన మామ అయిన పురుషోత్తంను హిట్ అండ్ రన్ చేయాలని ప్లాన్ వేసి విషయాన్ని వారికి వివరించింది. దీంతో ప్లాన్ ప్రకారం.. పురుషోత్తంను ఢీకొట్టి పారిపోయారు.
అధికారులకు అనుమానం రావడంతో సీసీఫుటేజీని చెక్ చేశారు. దీంతో అసలు కుట్ర బయటపడింది. ఆస్తికోసం ఇంతకు తెగించి మామను అంతమొందించాలని చూసిన అర్చన, ఆమె డ్రౌవర్ బగ్దే, ధార్మిక్ ప్రస్తుతం జైలులో ఊచలు లెక్కపెడుతున్నారు.