
చేర్యాల,వెలుగు: ఇటీవల బీఆర్ఎస్కు రాజీనామా చేసిన రాష్ట్ర నాయకుడు నాగపురి కిరణ్‌కుమార్‌గౌడ్ సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లోచేరారు. మంగళవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్‌రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ఆధ్వర్యంలో కాంగ్రెస్కండువా కప్పుకున్నారు. అనంతరం మాట్లడుతూ.. భువనగిరి పార్లమెంట్ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్‌కుమార్‌రెడ్డి గెలుపునకు కృషి చేస్తామన్నారు.
కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నాగపురి రాజలింగం గౌడ్, నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్‌రెడ్డి, మైనింగ్ కార్పొరేషన్ చైర్మన్అనిల్, మాజీ ఎమ్మెల్సీ రాజేశం, మహేందర్‌రెడ్డి ఉన్నారు.