
చేర్యాల, వెలుగు: బీఆర్ఎస్కు మరో షాక్ తగిలింది. ఆదివారం మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నాగపురి రాజలింగం కుమారుడు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కిరణ్ కుమార్ గౌడ్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. 2014లో వరంగల్ జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా ఉన్న కిరణ్ కుమార్ మాజీ సీఎం కేసిఆర్ పిలుపు మేరకు బీఆర్ఎస్ లో చేరారు. అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నా ఆయనకు ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వలేదు.