
వెలుగు, నెట్వర్క్ : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంగళవారం నాగుల చవితి వేడుకలు వైభవంగా జరిగాయి. మహిళలు పెద్ద సంఖ్యలో పుట్టల వద్దకు చేరుకుని పూజలు చేశారు. నాగదేవతను పూజిస్తూ పుట్టలో పాలు, గుడ్లు, అరటిపండ్లు, వడపప్పు, నువ్వులతో తయారు చేసిన ప్రసాదం వదిలి మొక్కులు చెల్లించుకున్నారు.