వివేక్ వెంకటస్వామిపై అసత్య ప్రచారాలు మానుకోండి : నగునూరి వెంకటేశ్వర్ గౌడ్

చెన్నూర్, వెలుగు : బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి పార్టీ మారుతున్నారంటూ అసత్య ప్రచారాలను ఎవరూ నమ్మొద్దని బీజేపీ పెద్దపల్లి జాయింట్ కన్వీనర్ నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ కోరారు. చెన్నూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వివేక్ వెంకటస్వామిని ఎదుర్కొనే శక్తి లేని టీఆర్ఎస్ పార్టీ.. ఆయన మీద అసత్య ప్రచారాలు చేసి రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు.

ALSO READ :- హైదరాబాద్ దుర్గం చెరువులో మ్యూజికల్ ఫౌంటేయిన్స్

కొద్ది రోజుల క్రితం ఆయన కాంగ్రెస్​లో చేరుతున్నారని తప్పుడు ప్రచారం చేశారని, ఇది బీఆర్​ఎస్​ నీచ రాజకీయాలకు నిదర్శనమని ఫైర్​అయ్యారు. ఇలాంటి అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మొద్దని కోరారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు రాపర్తి వెంకటేశ్వర్, పట్టణ అధ్యక్షుడు సుద్దపల్లి సుషీల్ కుమార్, ప్రధాన కార్యదర్శి చింతల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.