
కొత్తకోట, వెలుగు : వీపనగండ్ల సోషల్ వెల్ఫేర్ జూనియర్ కాలేజీలో సిబ్బంది క్లాస్ రూమ్లను శుభ్రం చేస్తుండగా, నాగుపాము కనిపించడంతో ఆందోళనకు గురయ్యారు. కాలేజీ ప్రిన్సిపాల్ దయాకర్ కు ఈ విషయం తెలపడంతో ఆయన ఎస్ఐ మంజునాథ్ రెడ్డికి సమాచారం ఇచ్చారు. పాములు పట్టుకునే కృష్ణసాగర్ ను రప్పించడంతో నాగుపామును బంధించి ఫారెస్ట్ లో వదిలేందుకు తీసుకెళ్లాడు.