పాలమూరు నీళ్లు వస్తాయని మోసం చేస్తున్రు: నేత నాగురావు నామాజీ

పాలమూరు నీళ్లు వస్తాయని మోసం చేస్తున్రు: నేత నాగురావు నామాజీ

నారాయణపేట, వెలుగు: పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా నీళ్లు వస్తాయని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న నారాయణపేట ఎమ్మెల్యే బహిరంగ క్షమాపణ చెప్పాలని బీజేపీ నేత నాగురావు నామాజీ డిమాండ్ చేశారు. సోమవారం ఆయన ఇంట్లో మీడియాతో మాట్లాడుతూ ప్రాజెక్టులపై ఎమ్మెల్యేకు కనీస అవగాహన లేదని పేర్కొన్నారు. పాలమూరు ప్రాజెక్టులోనూ నారాయణపేట చివరి ఆయకట్టు అవుతుందని, నీళ్లు వచ్చే అవకాశం లేదన్నారు. 

6 రిజర్వాయర్ల ద్వారా 675 మీటర్ల ఎత్తుకు నీటిని ఎత్తి పోయాలన్నారు. 23,775 ఎకరాలు ముంపునకు గురవుతాయని, నీటిని ఎత్తి పోయడానికి 5 వేల మెగావాట్ల విద్యుత్  అవసరమని తెలిపారు. నీళ్లు రావని తెలిసి ఓటమి భయంతో ప్రజలను మభ్యపెదుతున్నారని విమర్శించారు. జిల్లాలో ఒక్క డబుల్  బెడ్రూం ఇల్లు నిర్మించలేదని, మినీ స్టేడియం నిర్మాణం ఏమైందని ప్రశ్నించారు. ప్రభాకర్ వర్ధన్, రఘువీర్ యాదవ్, నందు నామాజీ, వెంకట్రాములు, రఘురామయ్య గౌడ్ పాల్గొన్నారు.