గాల్వాన్ లోయ అమరుడు దీపక్ సింగ్ కలను ఆయన భార్య రేఖాసింగ్ నేరవేర్చారు. భర్త అనుకున్నట్టే భారత సైన్యంలో చేరారు. అయితే తాను సాధించిన లక్ష్యాన్ని భర్త చూడలేకపోయినందుకు బాధగా ఉందన్నారు రేఖాసింగ్. మధ్యప్రదేశ్ కు చెందిన దీపక్ సింగ్ 2020 జూన్ లో గాల్వాన్ లోయలో చైనా సైనికులతో పోరాడుతూ వీరమరణం పొందారు. భార్య రేఖాసింగ్ ను ఎలాగైనా సైన్యంలో ఓ అధికారిణిగా చూడాలని ఆయన కలలు కనేవారు. అయితే రేఖా సింగ్ మాత్రం టీచర్ గా విద్యారంగానికే పరిమితం అయ్యారు. భర్త చనిపోవడంతో ఆయన కలల సాధనకు ఆమె నడుంబిగించారు. ఎంతో ఇష్టమైన టీచర్ వృత్తిని వదిలిపెట్టారు. సైన్యంలో చేరడానికి ఆర్మీ అధికారులతో సంప్రదించారు. నోయిడా వెళ్లి సైనిక పరీక్ష రాశారు. మొదటి సారి ఫెయిల్ అయినా, రెండోసారి పాసయ్యారు. ఆమె లెఫ్టినెంట్ హోదా దక్కించుకున్నారు. ఈ నెల 28 నుంచి చెన్నైలో ఆర్మీ ట్రైనింగ్ ప్రారంభం అవుతుందన్నారు రేఖా సింగ్.
మరిన్ని వార్తల కోసం