గ్రేటర్ వరంగల్ నయీమ్ నగర్ బ్రిడ్జి నాలా నిర్మాణంపై అధికార కాంగ్రెస్ పార్టీ, గులాబీ పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. కాంగ్రెస్ హయాంలో నిర్మించామని.. ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి..కాదు తాము నిర్మించామని బీఆర్ఎస్ నేతలంటున్నారు. అయితే బీఆర్ఎస్ నిర్మించినట్టు నిరూపించాలని ఎమ్మెల్యే నాయిని సవాల్ విసిరారు.
గ్రేటర్ వరంగల్ నయీంనగర్ బ్రిడ్జిపై కేటీఆర్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి విమర్శించారు. మాటల గారడీతో మభ్యపెడుతున్నారని ధ్వజమెత్తారు. నయీంనగర్ బ్రిడ్జి ఎవరు నిర్మించారో తెలియదా? పనులు చేయడం చేతగాని దద్దమ్మలు బీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ ప్రతిపాదనలు పెట్టగానే సరిపోతుందా...? నేను చేసే అభివృద్ధి చూసి ప్రజలు పూలాభిషేకం చేశారు. కేటీఆర్ ఒక కిల్ బిల్ పాండే.. మద్రాసు బాబు వినయ్ భాస్కర్ బ్రిడ్జి పనులు 95శాతం పూర్తిచేశామనడం సిగ్గుచేటు. హనుమకొండ బీఆర్ఎస్ ఆఫీస్ పార్క్ స్థలం వెంటనే ఖాళీ చేయాలని నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు.