కవిత ఒక్కరే కాదు.. కుటుంబమంతా జైలుకే : నాయిని రాజేందర్ రెడ్డి

వరంగల్ : చేసిన పాపపే పనులకు ఎమ్మెల్సీ కవిత ఒక్కరే కాదు.. కేసీఆర్​ కుటుంబమంతా జైలుపాలు కావాల్సిందేనని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. ఇవాళ జరిగిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ  చేసిన తప్పులకు  జీవితకాలం అంతా జైలులో ఉండాల్సిందేనని, రాష్ట్రపతి క్షమాభిక్ష కూడా ఉండదన్నారు. నయీం కేసులో కూడా బీఆర్​ఎస్​ సంబంధాలు సాక్ష్యాలతో సహా బయటకు వస్తున్నాయని ఆయన చెప్పారు. రెండు కోట్ల నిధులువుంటే రెండు వందల కోట్ల పనులకు శంకుస్థాపనలు చేసిన చరిత్ర  బీఆర్ఎస్​ నాయకులదని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్​ నేతల పాపాలు కడుక్కోలేనివన్నారు. బీఆర్​ఎస్​ ప్రభుత్వం పదేళ్లలో చేయలేని పనులను తమ ప్రభుత్వం నాలుగు నెలల్లో చేసిందన్నారు.  అభివృద్ధి పనులకు అడ్డుపడొద్దని హితవు పలికారు.