వరంగల్, వెలుగు: అన్న ప్రణయ్ భాస్కర్ విగ్రహం పెట్టని తమ్ముడు దాస్యం వినయ్ భాస్కర్ అని కాంగ్రెస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్‍రెడ్డి విమర్శించారు. మంగళవారం హనుమకొండ కాంగ్రెస్ భవన్లో ఆయన ప్రెస్‍మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వినయ్ భాస్కర్ తనను నమ్ముకున్నోళ్లను ఆగం చేస్తాడన్నారు.
నియోజకవర్గంలో కబ్జాలు చేసిన సొమ్మును మద్రాస్‍లో పెడుతూ కబ్జాల మద్రాస్ బాబు అనిపించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. యూనివర్సిటీ భూములు ఆక్రమించానని తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నాడని ఫీల్డ్ మీదకు వస్తే వినయ్ భాస్కర్ కబ్జాలు నిరూపించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. జూపార్కు ప్రాంతంలో ఎమ్మెల్యే అనుచరుడు శేషగిరిరావు 1000 గజాలు అక్రమంగా కబ్జా చేస్తే సహకారం అందించాడన్నారు. పోచమ్మకుంటలో ఎమ్మెల్యే అనుచరులు కబ్జాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. సమావేశంలో కార్పొరేటర్లు తోట వెంకటేశ్వర్లు, శ్రీమాన్, బంక సరళ, విక్రమ్, అజీజ్, రాజ్‍కుమార్, రహీమున్నిసా పాల్గొన్నారు.