మహాలక్ష్మి’ స్కీమ్‌‌‌‌‌‌‌‌ను వినియోగించుకోవాలి : నాయిని రాజేందర్‌‌‌‌‌‌‌‌రెడ్డి

వరంగల్‍, వెలుగు : మహిళల కోసం ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన మహాలక్ష్మి స్కీమ్‌‌‌‌‌‌‌‌ను వినియోగించుకోవాలని వరంగల్‌‌‌‌‌‌‌‌ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌‌‌‌‌‌‌‌రెడ్డి సూచించారు. ఆర్టీసీ రీజియన్‌‌‌‌‌‌‌‌ మేనేజర్‌‌‌‌‌‌‌‌ శ్రీలతతో కలిసి సోమవారం హనుమకొండలో ఫ్రీ బస్‌‌‌‌‌‌‌‌ జర్నీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళల సంక్షేమం కోసం గతంలో ఏ ప్రభుత్వం చేయని సాహసం కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వం చేసిందన్నారు.

కార్యక్రమంలో డిప్యూటీ ఆర్‌‌‌‌‌‌‌‌ఎంవోలు భానుకిరణ్‍, మాధవరావు, హనుమకొండ డీఎం ధరంసింగ్‍, వరంగల్‍ 2 డిపో మేనేజర్‌‌‌‌‌‌‌‌ సురేశ్‌‌‌‌‌‌‌‌ పాల్గొన్నారు. అనంతరం డీఆర్డీవో శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌, డీఎంహెచ్‌‌‌‌‌‌‌‌వో సాంబశివరావుతో కలిసి హనుమకొండ జీఎంహెచ్‌‌‌‌‌‌‌‌లో ఆరోగ్య శ్రీ చేయూత పథకాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో కేఎంసీ ప్రిన్సిపల్‌‌‌‌‌‌‌‌ మోహన్‌‌‌‌‌‌‌‌దాస్‌‌‌‌‌‌‌‌, జిల్లా లైబ్రరీ మాజీ చైర్మన్‌‌‌‌‌‌‌‌ అజీజ్‌‌‌‌‌‌‌‌ఖాన్‌‌‌‌‌‌‌‌, కార్పొరేటర్‌‌‌‌‌‌‌‌ శ్రీమాన్‍, రెడ్‌‌‌‌‌‌‌‌ క్రాస్‌‌‌‌‌‌‌‌ ఈసీ మెంబర్‌‌‌‌‌‌‌‌ ఈవీ.శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌ పాల్గొన్నారు. అంతకుముందు హనుమకొండ కలెక్టర్‌‌‌‌‌‌‌‌ సిక్తా పట్నాయక్‍ను మర్యాదపూర్వకంగా కలిశారు.