ఆసియా కప్ లో భాగంగా అభిమానులు ఎంతగానో ఎదురు చూసిన భారత్ పాకిస్థాన్ మ్యాచ్ కి వర్షం కారణంగా రద్దయిన సంగతి తెలిసిందే. కేవలం ఒక్క ఇన్నింగ్స్ మాత్రమే జరిగిన ఈ మ్యాచులో భారత్ గౌరవ ప్రథమమైన స్కోర్ చేయగా.. పాక్ బౌలర్లు పర్వాలేదనిపించారు. అంతేకాదు మిగిలిన మ్యాచులకి కూడా వర్షం ముప్పు ఉంది. దీంతో శ్రీలంకలోని కొలొంబోలో జరిగే మ్యాచులన్నీ వేరే వేదికకు మార్చాలని కొందరు సూచించినా ఈ విషయంపై ఏసీసీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
తాజాగా ఈ విషయంపై పాకిస్థాన్ మాజీ చైర్మన్ స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేసాడు " కొలంబోలో రానున్న కొన్ని రోజులపాటు భారీ వర్షాలు, తుఫానులు వచ్చే అవకాశం ఉంది. అయినా సరే ఆసియా కప్ మ్యాచులను వేరే చోటకు మార్చకపోవడం తనకు ఆశ్చర్యం కలిగిస్తుందని సేథ్ చెప్పుకొచ్చాడు. ఈ సందర్భంగా బీసీసీఐని టార్గెట్ చేస్తూ పాక్ చేతిలో ఓడిపోతామని భయంతో ఈ మ్యాచ్ కూడా వర్షార్పణం చేయాలని అనుకుంటున్నారా? అంటూ చురకలంటిచ్చాడు.
ఇప్పటికే భారత్ పాక్ మ్యాచ్ ని కొలొంబోలో కాకుండా హంబంతోటకు మార్చినట్లుగా పాక్ కి సమాచారం అందిందని.. అయితే ఇది జరిగిన గంటలోపే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని మరల కొలొంబోనే వేదికగా ఫిక్స్ చేశారని మండిపడ్డాడు. అసలేం జరుగుతోంది? పాక్ చేతిలో ఇండియా ఓడిపోతానని భయపడుతోందా?' అంటూ తన ఎక్స్ ఖాతాలో పోస్టు పెట్టాడు నజీమ్ సేథ్.