
టీమిండియా యువ బౌలర్ మయాంక్ యాదవ్ కు బంగ్లాదేశ్ తో జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో తుది జట్టులో చోటు దక్కింది. తన తొలి అంతర్జాతీయ మ్యాచ్ లో అద్భుతంగా రాణించాడు. ఆడుతుంది తొలి మ్యాచ్ అయినా అతను బౌలింగ్ వేసిన విధానానికి అందరూ ఫిదా అయ్యారు. మొత్తం నాలుగు ఓవర్ల స్పెల్ లో కేవలం 21 పరుగులే ఇచ్చి ఒక వికెట్ పడగొట్టాడు. వేసిన తొలి ఓవర్ మెయిడీన్ ఓవర్ కావడం విశేషం. తన రెండో ఓవర్ లోనే వికెట్ పడగొట్టాడు. గంటకు 145 కిలో మీటర్ల వేగంతో బంతులు వేస్తూ బంగ్లాను భయపెట్టాడు.
పూణే వేదికగా నేడు (అక్టోబర్ 9) బంగ్లాదేశ్ తో రెండో వన్డే జరగనుంది. ఈ మ్యాచ్ లోనూ అందరి దృష్టి మయాంక్ పైనే ఉంది. అయితే అతని గురించి తమకు ఎలాంటి భయం లేదని బంగ్లాదేశ్ కెప్టెన్ నజీముల్ శాంటో తెలిపాడు.ఈ ఎక్స్‌ప్రెస్ ఫాస్ట్ బౌలర్‌ను ఎదుర్కోవడంపై పర్యాటక జట్టు ఆందోళన చెందడం లేదని బంగ్లాదేశ్ కెప్టెన్ శాంటో చెప్పాడు. తమ జట్టులో మయాంక్ లాంటి సీమర్లు నెట్ బౌలర్లుగా ఉన్నారని రెండో టీ20 కు ముందు చెప్పుకొచ్చాడు. మయాంక్ గొప్ప బౌలర్ అని.. రెండో టీ20 మ్యాచ్ లో పుంజుకుంటామని ఆశాభావం చేశాడు.
Also Read:- జడేజాకు రూ. 18 కోట్లు.. చెన్నై రిటైన్ ఆటగాళ్లు వీళ్లేనా
సాయంత్రం 7:00 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. పలువురు స్టార్ ప్లేయర్లు, సీనియర్లకు రెస్ట్ ఇచ్చి కుర్రాళ్లతో బరిలోకి దిగినప్పటికీ గ్వాలియర్‌లో టీమిండియా తిరుగులేని ఆట చూపెట్టింది. లిటన్ దాస్, మహ్ముదుల్లా తదితరులు మెరుగ్గా ఆడితేనే ఆతిథ్య జట్టుకు కనీసం పోటీ అయినా ఇవ్వగలదు.
Bangladesh captain Najmul Hossain Shanto shares his thoughts on Mayank Yadav following the first T20I against India. pic.twitter.com/OeuiX0nWaS
— CricTracker (@Cricketracker) October 8, 2024