గంజాయి మత్తులో యువత భవిష్యత్తు ఆగం: నకిరేకల్ సీఐ

గంజాయి మత్తులో యువత భవిష్యత్తు ఆగం చేసుకోవద్దన్నారు నకిరేకల్ సీఐ రాజశేఖర్. రాష్ట్రంలో గంజాయి సప్లై చేస్తున్న వారిపై ప్రభుత్వం సీరియస్ గా ఉందని.. స్మగ్లర్స్ పై ఉక్కు పాదం మోపుతామని హెచ్చరించారు. 

నల్లగొండ జిల్లా నకిరేకల్ లో గంజాయి సప్లై చేస్తున్న ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. గత ఆరు నెలలుగా ఆంధ్ర బార్డర్ నుంచి గంజాయి కొనుగోలు చేసి.. విద్యార్థులు, యువతకు అమ్ముతుండగా వారిని పట్టుకున్నామని వివరించారు. వారివద్ద నుంచి 600 గ్రాముల గంజాయి, హుక్కాను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. 

అయితే ఈ క్రమంలో గంజాయికి బానిస అయిన విద్యార్థులకు సీఐ రాజశేఖర్ కౌన్సిలింగ్ ఇచ్చారు.