మానవత్వాన్ని చాటుకున్న ఎమ్మెల్యే 

  • రోడ్డు ప్రమాదంలో క్షతగాత్రులకు నిమిషాల్లో మెరుగైన వైద్యం అందించిన చిరుమర్తి లింగయ్య

నల్లగొండ జిల్లా: రోడ్డు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు ప్రథమ చికిత్సను అందించి మానవత్వాన్ని చాటుకున్నారు నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య. శుక్రవారం నాడు కేతేపల్లి మండలంలో తన కార్యక్రమాలను ముగించుకొని నార్కట్ పల్లి వైపు వస్తుండగా.. ఇనుపాముల ఫ్లై ఓవర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగినట్లు గమనించారు. వెంటనే తన వాహనాన్ని ఆపి  ప్రమాదంలో గాయపడి అపస్మారక స్థితిలో పడి ఉన్న యువకులకు దగ్గరుండి ప్రథమ చికిత్సను అందించారు. వెంటనే అంబులెన్స్ ను రప్పించి వారిని కామినేని ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు. గాయపడిన వారి గురించిన సమాచారాన్ని ఆస్పత్రి వైద్యులకు తెలియజేసి ముందస్తు ఏర్పాట్లతో తక్షనం మెరుగైన వైద్యం అందించే ఏర్పాట్లు చేశారు. ఎమ్మెల్యే ఫోన్ కాల్ తో ఆసుపత్రి యాజమాన్యం అప్రమత్తమై.. వైద్య సిబ్బందితో క్షతగాత్రులకు తక్షణ వైద్యం అందించారు.

 

ఇవి కూడా చదవండి

కొనుగోలు సెంటర్లలోనే వడ్ల బస్తాలకు చెదలు

మీరు పార్లమెంట్‌ ను రద్దు చేస్తే.. మేం అసెంబ్లీని రద్దు చేయిస్తం

ప్రైవేట్ స్కూల్స్ కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు