
చిట్యాల, వెలుగు : రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, ఎన్నికల్లో ఇచ్చినమాట ప్రకారం సన్న వడ్లు క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇస్తున్నామని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. శుక్రవారం చిట్యాల, వట్టిమర్తి గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తుందన్నారు. కార్యక్రమంలో చిట్యాల మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ వినోద మోహన్ రెడ్డి, ఎంపీడీవో జయలక్ష్మి, వ్యవసాయశాఖ అధికారి గిరిబాబు, పీఏసీఎస్‌చైర్మన్ మల్లేశ్ గౌడ్, పంచాయతీ సెక్రటరీ పరమేశ్, రైతులు పాల్గొన్నారు.